పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : విష్ణుమూర్తి పరికరాదులు

విష్ణుమూర్తి సంబంధించిన వాని వివరములు

ఆయుధములు
శంఖము పాంచజన్యము
చక్రము సుదర్శనము, సునాభము
గద కౌమోదకి
ధనుస్సు శార్ఙ్గము
కత్తి నందకము
రథము / తేరు శతానందము
వాహనము గరుత్మంతుడు
సేనానాయకుడు విష్వక్సేనుడు
సారథి దారకుడు
గుర్రములు 1సైబ్య 2సుగ్రీవ 3పుష్ప 4వలాహకములు

ఆభరణములు
శ్రీవత్సము వక్షస్థలమందలి పుట్టుమచ్చ
వైజయింతీమాల వనమాలిక కంఠమునందలి మాల
తులసీమాల కంఠమునందలి మాల
కౌస్తుభము వక్షమునందలి మణి
లక్ష్మీదేవి వక్షమునందు అలంకరించి యుండును
పద్మము చేతిలో
శమంతకము చేతిలోని మణి
అంగదములు భుజకీర్తులు

విష్ణుమూర్తి గద - కౌమోదకి, వ్యుత్పత్తి.

కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ,
తా. భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధ మైనది

పరిచరులు

సునంద, నంద, జయ, విజయ,జయంత, ప్రబలోద్బల, కుముద, కుముదాక్ష,తార్క్ష్య, పుష్పదంత, శ్రుతదేవ, సాత్వత,విష్వక్సేన

భార్య లక్ష్మీదేవి
పాన్పు ఆదిశేషుడు
లోకము వైకుంఠము
భక్త సమూహములు వైష్ణవులు
భక్తులు నారదుడు,తుంబురుడు,ప్రహ్లాదుడు,పరీక్షిత్తు,ధ్రువుడు,అంబరీషుడు


అష్టభుజ విష్ణుమూర్తి ఎనిమిది (8) చేతులలో ఉండే ఆయుధాలు:-

  1. చక్రం,
  2. ధనుస్సు,
  3. పద్మం,
  4. శంఖం,
  5. ఖడ్గం,
  6. పాశం,
  7. డాలు,
  8. గదాదండం.