పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : కాలము - కొలత (1) దినభాగములు - ముహూర్తములు

(1) దినభాగములు - ముహుర్తములు

(ద్వితీయస్కంధము,12వ పద్యము)
(సూర్యోదయము 06.00 గంటలకు అయితే, కానిచో సవరించుకొనవలెను) చూ. ఆంద్రశబ్దరత్నాకరము, సూర్యారాయాంధ్ర నిఘంటులు - దినభాగములు
క్రమసంఖ్య పేరు పగలు సమయము గం.ని లలో రాత్రి సమయము గం.ని లలో
1 రౌద్రము 6 నుండి 6.48 18 నుండి 18.48
2 శ్వేతము 6.48 నుండి 7.36 18.48 నుండి 19.36
3 మైత్రము 7.36 నుండి 8.24 19.36 నుండి 20.24
4 కారభటము 8.24 నుండి 9.12 20.24 నుండి 21.12
5 సావిత్రము 9.12 నుండి 10 21.12 నుండి 22
6 విజయము 10 నుండి 10.48 22 నుండి 22.48
7 గాంధర్వము 10.48 నుండి 11.36 22.48 నుండి 23.36
8 కుతపము 11.36 నుండి 12.24 23.36 నుండి 0.24
9 రౌహిణేయము 12.24 నుండి 13.12 0.24 నుండి 1.12
10 విరించము 1.12 నుండి 2 13.12 నుండి 14
11 సోమము 2 నుండి 2.48 14 నుండి 14.48
12 నిరృతి 2.48 నుండి 3.36 14.48 నుండి 15.36
13 మహేంద్రము 3.36 నుండి 4.24 15.36 నుండి 16.24
14 వరుణము 4.24 నుండి 5.12 16.24 నుండి 17.12
15 భటము 5.12 నుండి 6 17.12 నుండి 18


(2) కాలము కొలతలు

(తృతీయస్కంధ- 346వ. పద్యము)

రాశి విలువ సుమారు ఇప్పటి పరిమాణము
సూక్ష్మకాలము – సూర్యకిరణములోని 1/6 వ వంతు త్రసరేణువును కాంతి దాటు సమయము పరమాణువు 0.33 micro sec
1 అణువు 2 పరమాణువులు 0.65 micro sec
2 త్రసరేణువు 3 అణువులు 0.13 micro sec
3 తృటి 3 త్రసరేణువు 0.39 milli sec
4 వేధ 100 త్రసరేణువులు 13.33 millisec
5 లవము 3 వేధలు 0.4 sec
6 నిమేషము 3 లవములు 1.2 sec
7 క్షణము 3 నిమేషములు 3.6 sec
8 కాష్ఠ 5 క్షణములు 18 sec
9 లఘువు 10 కాష్ఠలు 3 min
10 నాడి 50 లఘువులు 15 min
11 ముహుర్తము 2 నాడులు 30 min
12 ప్రహరము, యామము 6 లేదా 7 నాడులు 3 Hrs
13 పగలు లేదా రాత్రి 4 యామములు 12 Hrs
14 దినము 8 యామములు 24 Hrs


(3) కాలము కొలత (ఇంకొక విధము) SK_10.2-425

18 రెప్పపాటులు1 కాష్టము
30 కాష్టలు1 కళ
10 విగడియలు1 క్షణము
1 రెప్పపాటుకాలము1 నిమిషము
4 నిమిషములు1 క్షణము
6 క్షణములు1 గడియ
2 గడియలు1 ముహూర్తము
15 ముహుర్తములు1 పగలు లేదా రాత్రి


(4) కాలము - కొలత

1 పక్షము 15 తిథులు
1 మాసము 2పక్షములు,1నెల
1 ఋతువు 2మాసములు
1 కాలము 4మాసములు
1 అయనము 6 మాసములు
1 సంవత్సరము 12 మాసములు, 6 ఋతువులు, 3కాలములు

5 కాలము - కొలత

పక్షములు రెండు(2)1శుక్ల 2 కృష్ణ
మాసములు (12).1చైత్ర 2వైశాఖ 3 జ్యేష్ట 4ఆషాఢ 5శ్రావణ 6బాధ్రపద
7ఆశ్వయుజ 8కార్తీక 9మార్గశిర 10పుష్య 11 మాఘ 12ఫాల్గుణములు
ఋతువులు (6)వసంతఋతువు, గ్రీష్మఋతువు, వర్షఋతువు,
శరదృతువు,హేమంతఋతువు మరియు 6 శిశిరఋతువు

1వసంతఋతువు చైత్ర, వైశాఖ - మాసములు
2 గ్రీష్మఋతువు జ్యేష్ట, ఆషాఢ - మాసములు
3 వర్షఋతువు శ్రావణ, బాధ్రపద - మాసములు
4 శరదృతువు ఆశ్వయుజ, కార్తీక - మాసములు
5 హేమంతఋతువు మార్గశిర, పుష్య - మాసములు
6 శిశిరఋతువు మాఘ, ఫాల్గుణ - మాసములు
కాలములు (3): 1 వేసవికాలము, 2 వానాకాలము, 3 శీతాకాలము
అయనములు (2) 1ఉత్తరాయణము, 2దక్షిణాయణము


(6) కాలము - కొలత

సంవత్సరములు-అరవై (60)

  ________________________________________________
 1. ప్రభవ
 2. విభవ
 3. శుక్ల
 4. ప్రమోదూత
 5. ప్రజోత్పత్తి
 6. అంగీరస
 7. శ్రీముఖ
 8. భావ
 9. యువ
 10. ధాతు
 11. ఈశ్వర
 12. బహుధాన్య
 13. ప్రమాది
 14. విక్రమ
 15. విషు
 16. చిత్రభాను
 17. స్వభాను
 18. తారణ
 19. పార్థివ
 20. వ్యయ
 21. సర్వజిత్తు
 22. సర్వధారి
 23. విరోధి
 24. వికృతి
 25. ఖర
 26. నందన
 27. విజయ
 28. జయ
 29. మన్మథ
 30. దుర్ముఖి
 31. హేవిళంబి
 32. విళంబి
 33. వికారి
 34. శార్వరి
 35. ప్లవ
 36. శుభకృత్తు
 37. శోభకృత్తు
 38. క్రోధి
 39. విశ్వావసు
 40. పరాభవ
 41. ప్లవంగ
 42. కీలక
 43. సౌమ్య
 44. సాధారణ
 45. విరోధికృత్తు
 46. పరీధావి
 47. ప్రమాదీచ
 48. ఆనంద
 49. రాక్షస
 50. నళ
 51. పింగళ
 52. కాళయుక్తి
 53. సిద్ధార్థి
 54. రౌద్రి
 55. దుర్మతి
 56. దుందుభి
 57. రుధిరోద్గారి
 58. రక్తాక్షి
 59. క్రోధన
 60. క్షయ


దివ్యకాల మానము
పితృదేవతల దినము = మానవుల మాసము
సురల దినము = మానవుల సంవత్సరము

(8) కాలము కొలతలు

(తృతీయస్కంధ 349వ. పద్యము)

1 మహా యుగము 4 యుగములు
యుగముల పేర్లుయుగముసంధి కాల పరిమితి (దివ్యసంవత్సరములు)
1 కృతయుగము 40008004800
2 త్రేతాయుగము 30006003600
3 ద్వాపరయుగము 20004002400
4 కలియుగము10002001200
మొత్తము 12000

1 దివ్యవత్సరము 360 మానవవత్సరములు అందుచేత
యుగముల పేర్లు కాల పరిమితి (మానవవత్సరములు)
1 కృతయుగము 1726000
2 త్రేతాయుగము 1298000
3 ద్వాపరయుగము 864000
4 కలియుగము 432000
మొత్తం 4320000
సంధ్యాకాలం 17,28,000
మహాయుగము 30,67,2000

కలియుగసంఖ్య 432 magic number mentioned in many mythologies


1 మన్వంతరము 71 మహాయుగములు 71x43,20,000
=30,67,2000 సం.
1బ్రహ్మ పగలు / రాత్రి 14/15 మన్వంతరములు, మన్వంతరం
+ సంధ్యా కాలం
= 30, 84,48,000 సం.
1 బ్రహ్మ రోజు 29 మన్వంతరములు
1 బ్రహ్మవత్సరము 360 బ్రహ్మరోజులు
1 బ్రహ్మ ఆయువు పరిమాణము 100 బ్రహ్మవత్సరములు
ఇంకోవిధముగ (352 పద్యము ప్రకారము)
1 బ్రహ్మ పగలు / రాత్రి 1000 మహాయుగములు

1000 చతుర్యుగములు