పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత - (5) పేర్లు తిథి పక్షము మాసము ఋతువు కాలం

5 కాలము - కొలత

పక్షంలోని తిథులు - 15

1) పాడ్యమి ; 2) విదియ ; 3) తదియ ; 4) చవితి ; 5) పంచమి ; 6) షష్ఠి ;
7) సప్తమి ; 8) అష్టమి ; 9) నవమి ; 10) దశమి ; 11) ఏకాదశి ; 12) ద్వాదశి ;
13) త్రయోదశి ; 14) చతుర్దశి ; 15) పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి (లేదా) అమావాస్య

పక్షములు రెండు(2)1శుక్ల 2 కృష్ణ
మాసములు (12).1చైత్ర 2వైశాఖ 3 జ్యేష్ట 4ఆషాఢ 5శ్రావణ 6బాధ్రపద
7ఆశ్వయుజ 8కార్తీక 9మార్గశిర 10పుష్య 11 మాఘ 12ఫాల్గుణములు
ఋతువులు (6)వసంతఋతువు, గ్రీష్మఋతువు, వర్షఋతువు,
శరదృతువు,హేమంతఋతువు మరియు 6 శిశిరఋతువు

1వసంతఋతువు చైత్ర, వైశాఖ - మాసములు
2 గ్రీష్మఋతువు జ్యేష్ట, ఆషాఢ - మాసములు
3 వర్షఋతువు శ్రావణ, బాధ్రపద - మాసములు
4 శరదృతువు ఆశ్వయుజ, కార్తీక - మాసములు
5 హేమంతఋతువు మార్గశిర, పుష్య - మాసములు
6 శిశిరఋతువు మాఘ, ఫాల్గుణ - మాసములు
కాలములు (3): 1 వేసవికాలము, 2 వానాకాలము, 3 శీతాకాలము
అయనములు (2) 1ఉత్తరాయణము, 2దక్షిణాయణము

రాశులు: -
మనం భూమి మీదనుంచి చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు భూమి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి.దీనిని రాశి చక్రము అంటారు. ఈ ఊహాజనిత కక్ష్య వెంబడి పన్నెండు నక్షత్రాల గుంపులను గుర్తించారు. అలా ఈ రాశి చక్రము 12 భాగాలుగా విభాగించారు. ఈ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ఆ ఆకారాలను బట్టి వాటికి:

1) మేషం, 2) వృషభం, 3) మిథునం, 4) కర్కాటకం, 5) సింహం, 6) కన్య,
7) తుల, 8) వృశ్చికం, 9) ధనుస్సు, 10) మకరం, 11) కుంభం, 12) మీనం

అని పేర్లు పెట్టారు.
సూర్యుడు ఈ రాశి చక్రాన్ని సంవత్సరానికి ఒకమారు చుట్టివస్తాడు. అంటే ఒక్కొక్క రాశిలో దాదాపు ఒక నెల ఉంటాడు. (నిజానికి ఇది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం.) ఇది సౌర మానం.

నక్షత్రాలు
ఈ రాశి చక్రంలో చంద్రుడు 27-28 రోజులలో భూమిని చుట్టి తిరిగేటప్పుడు చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రానికి దగ్గరగా వస్తాడు. ఇలాంటి నక్షత్రాలను ఇరవై ఏడింటిని గుర్తించారు. అవి:

1. అశ్విని, 2. భరణి, 3. కృత్తిక, 4. రోహిణి, 5. మృగశిర, 6. ఆర్ద్ర, 7. పునర్వసు, 8. పుష్యమి, 9. ఆశ్లేష, 10. మఘ, 11. పుబ్బ(పూర్వ ఫల్గుణి), 12. ఉత్తర(ఉత్తర ఫల్గుణి), 13. హస్త, 14. చిత్త, 15. స్వాతి, 16. విశాఖ, 17. అనురాధ, 18. జ్యేష్ఠ, 19. మూల, 20. పూర్వాషాఢ, 21. ఉత్తరాషాఢ, 22. శ్రవణం, 23. ధనిష్ఠ, 24. శతభిషం, 25. పూర్వాభాద్ర, 26. ఉత్తరాభాద్ర, 27. రేవతి

ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు (4) పాదాలు. అంటే మొత్తం 108 నక్షత్ర పాదాలు (27 x 4=108) ఈ నక్షత్ర రాసులు 9 చొప్పున ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అవి అలా 12 నెలలకు సమానం. ఆ రాశిలోని ప్రథమ నక్షత్రం బట్టి ఆ నెలకు పేరుపెట్టారు.

రాశులు - నక్షత్రాలు

(1) మేషం - అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
(2) వృషభం - కృత్తిక 2వ, 3వ, 4వ పాదాలు, రోహిణి, మృగశిర 1వ, 2వ పాదాలు
(3) మిథునం - మృగశిర 3వ , 4వ పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1వ, 2వ ,3వ పాదాలు(4) కర్కాటకం - పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
(5) సింహం - మఘ, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి) 1వ పాదం(6) కన్య - ఉత్తర (ఉత్తర ఫల్గుణి) 2వ, 3వ ,4వ పాదాలు, హస్త, చిత్త 1వ, 2వ పాదాలు(7) తుల - చిత్త 3వ, 4వ పాదాలు, స్వాతి, విశాఖ 1వ, 2వ, 3వ పాదాలు(8) వృశ్చికం - విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ
(9) ధనుస్సు - మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
(10) మకరం - ఉత్తరాషాఢ 2వ, 3వ, 4వ పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1వ, 2వ పాదాలు
(11) కుంభం - ధనిష్ఠ 3వ, 4వ పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1వ, 2వ, 3వ పాదాలు
(12) మీనం - పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.