పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : ఏక చతుఃశ్లోకీ భాగవతములు

ఏకశ్లోకి భాగవతం


శ్లో.

అద్ధౌ దేవకి దేవి గర్బజననం గోపీ గృహేర్వర్దనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్దనోధ్దారణం
కంసఛ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాపాలనం
ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణలీలామృతం.చతుశ్లోకీ భాగవతం

పుండరీకాక్షుండు బ్రహ్మకుపదేశించుట -స్కంధము 2 – అధ్యాయము 9 - వ్యాసవిరచితం

శ్రీభగవానువాచ


 1. శ్లో.

  ఙ్ఞానం పరమగుహ్యం మే యద్విఙ్ఞానసమన్వితమ్
  నరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా.

 2. శ్లో.

  యావా నహం యథా భావో య ద్రూప గుణకర్మకః
  త దైవ తత్త్వవిఙ్ఞాన మస్తు తే దనుగ్రహాత్.
  అహ మే వాస మోకోగ్రే నాన్యద్యత్సద నత్పరమ్
  పశ్చా దహం యదే తచ్చ యో౬వశిష్యేత సో స్మ్యహమ్

 3. శ్లో.

  ఋతేర్థం య త్ప్రతీయ త నప్రతీయే నచాత్మని
  త ద్విద్యా దాత్మనో మాయాం యథాభాసో యథాతమః.
  యథా మహాంతి భూతాని భూతేషూచ్చా వచేష్వను
  ప్రవిష్టా న్యప్రవిష్టాని తథా తేషు న తే ష్వహమ్.

 4. శ్లో.

  ఏ తావదేవ జిఙ్ఞాస్యం తత్త్వజిఙ్ఞాసునాత్మనః
  అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా.
  ఏతన్మతం సమాతిష్ట పరమేణ సమాధినా
  భవాన్ కల్పవికల్పేషు న విముష్యతి కర్హి చిత్.పోతన భాగవతము

ద్వితీయ స్కంధము, 257వ. పద్యము

 1. కంద పద్యము

  వారిజభవ శాస్త్రార్థ వి
  చార జ్ఞానమును భక్తి సమధిక సాక్షా
  త్కారములను నీ మూఁడు ను
  దారత నీ మనమునందు ధరియింపనగున్

 2. సీస పద్యము

  పరికింప మత్స్వరూప స్వభావములును; మహిమావతార కర్మములుఁదెలియఁ
  తత్త్వ విజ్ఞానంబుదలకొని మత్ప్రసా; దమునఁగల్గెడి నీకుఁగమలగర్భ
  సృష్టి పూర్వమునఁజర్చింప నేనొకరుండఁ; గలిగి యుండుదు వీత కర్మినగుచు
  సమధిక స్థూల సూక్ష్మ స్వరూపములుఁద; త్కారణ ప్రకృతియుఁదగ మదంశ
  ఆటవెలది
  మందు లీనమైననద్వితీయుండనై
  యుండు నాకన్యమొకటి లేదు
  సృష్టి కాలమందు సృజ్యమానంబగు
  జగము మత్స్వరూపమగును వత్స

 3. వచనము

  అదియునుంగాక నీవు నన్నడిగిన యీ జగన్నిర్మాణ మాయాప్రకారంబెఱింగింతు లేని యర్థంబు శుక్తి రజత భ్రాంతియుంబోలెనేమిటి మహిమందోఁచి క్రమ్మఱఁదోఁపకమానునదియె మదీయమాయా విశేషంబని యెఱుంగుమదియునుంగాక లేని యర్థంబుదృశ్యమానంబగుటకునుగల యర్థంబు దర్శన గోచరంబుగాకుండుటకును ద్విచంద్రాదికంబునుదమఃప్రభాసంబునుదృష్టాంతంబులుగాఁదెలియు.