పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : భాగవతోత్తమ ధర్మంబులు

భాగవతోత్తమ ధర్మంబులు

 SK_11-54-వ.

1. మూఢుల పొంతల పోకపోవుట;
2. సద్గురు ప్రతిదిన భజనంబు;
3.సాత్త్వికంబు;
4. భూతదయ;
5. హరి కథామృతపానంబు;
6. బ్రహ్మచర్యవ్రతంబు;
7. విషయంబుల మనంబు సేరకుండుట;
8. సాధు సంగంబు;
9. సజ్జన మైత్రి;
10. వినయ సంపత్తి;
11. శుచిత్వంబు;
12. తపంబు;
13. క్షమము;
14. మౌన వ్రతంబు;
15. వేదశాస్త్రా ధ్యయన తదర్థానుష్ఠానంబులు;
6. అహింస;
17. సుఖదుఃఖాది ద్వంద్వ సహిష్ణుత;
18. ఈశ్వరుని సర్వగతునింగా భావించుట;
19. ముముక్షుత్వంబు;
20. జనసంగ వర్జనంబు;
21. వల్కలాది ధారణంబు;
22. యదృచ్ఛాలాభ సంతుష్టి;
23. వేదాంతశాస్త్రార్థ జిజ్ఞాస;
24. దేవతాంతరనిందా వర్జనంబు;
25. కరణత్రయ శిక్షణంబు;
26. సత్య వాక్యత;
27. శమదమాది గుణ విశిష్టత్వంబు;
28. గృహారామ క్షేత్ర కళత్ర పుత్త్ర విత్తాదుల హరికర్పణంబు సేయుట;
29. ఇతర దర్శన వర్జనంబు సేయుట.