పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : అష్టదిగ్గజములు

అష్టదిగ్గజములు

దిక్కు గజములు గజ భార్యలు
తూర్పు ఐరావతం అభ్ర
ఆగ్నేయం పుండరీకం కపిల
దక్షిణ వామనం పింగళ
నైఋతి కుముదం అనుపమ
పడమర అంజనం తామ్రపర్ణి
వాయవ్యం పుష్పదంత శుభ్రదంతి
ఉత్తరం సార్వభౌమ అంగన
ఈశాన్యం సుప్రతీకం అంజనావతి

పాఠ్యంతరం
నాలుగు దిక్కులలో నాలుగు దిగ్గజాలు ఉంటాయి అవి:-
ఋషభము, పుష్కరచూడము, వామనము, అపరాజితము.
ఆధారం: తెలుగు భాగవతము:-
5.2-73-వ,
బ్రహ్మచేతఁ జతుర్దిశల యందు ఋషభ పుష్కరచూడ వామ నాపరాజిత సంజ్ఞలుగల దిగ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండు;