పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పంచమలములు

బ్రహ్మఙ్ఞానార్జనలో కలిగెడి ఐదు మలములు (అశుద్ధములు)

మలములు అనగా విడువ వలసిన అశుద్ధములు, ఇవి రెండురకమలు, అవి; (అ) స్థూలమలము, (ఆ) సూక్ష్మమలము
# (సౌజన్యము: తెలుగుభాగవతం.ఆర్గ్)
ఉభయమలములు :-
(అ) స్థూలమలములు (నరులు భౌతికముగా విడిచే మలములు); (ఆ) సూక్ష్మమలములు (యోగసాధనలో విడిచే మలము) = 2-69-ఉ.

#(సౌజన్యము సూర్యారాయాంధ్ర నిఘంటువు, ఆంధ్రవాచస్పతములు)
(అ) స్థూల మలములు = ఇవి పన్నెండు = శ్లో. వసాశుక్రమసృజ్మజ్జా, మూత్ర కర్ణవిట్ నఖాః, శ్లేష్మస్థిదూషికా స్వేదో, ద్వాదశైతో నృణాం మలాః
1) వస (కొవ్వు), 2) శుక్లము (రేతస్సు), 3) రక్తము (నెత్తురు, అసృము), 4) మజ్జము (ఎముకలలోనూ పుర్రెలలోనూ ఉండునది, మెదడు), 5) మూత్రము (ఉచ్చ), 6) విష్ట (పియ్య, ఏరుగడ), 7) పింజూషము (గులిమి), 8) నఖము (గోరు), 9) శ్లేష్మము (తెమడ), 10) ఆశ్రువు (కన్నీరు), 11) దూషి లేదా దూషిక లేదా దూషము (కంటి పుసి), స్వేదము (చెమట);
పాఠ్యంతరమున ఇవి పదమూడు - 13) శింఘాణము (చీమిడి).

# (సౌజన్యము: తెలుగుభాగవతం.ఆర్గ్)
(ఆ) సూక్ష్మ మలములు, ఇవి ఐదు అవి :-
పంచమలములు = 1) ఆణవ, 2) కార్మిక, 3) మాయిక, 4మాయేయ, 5) తిరోధానములు అనెడి ఆధ్యాత్మవిధ్యార్జనలో కలిగెడి మలములు = 10.1-682-సీ.; 10.1-766-వ.

#(సౌజన్యము: విద్యార్థి కల్పతరువు – పారిభాషిక పదములు)
1 ఆణవమలము = పరబ్రహ్మమమునుగూర్చి అపుడపుడు కల్గెడు ఙ్ఞానమును మఱుగుపరచునది.
2 కార్మికమలము = గురువు బోధించిన పరమార్థమునందు బుద్ధి చొరనీయనిది.
3 మాయికమలము = పరతత్త్వఙ్ఞాన వాసనను ఎప్పుడు కలుగనీయనిది.
4 మాయేయమలము = పాపకార్యములందు మాత్రమే బుద్ధినిజొన్పునది.
5 తిరోధానమలము = పరబ్రహ్మము అనిత్యమనెడి బుద్ధిని కల్గించి జననమరణాది దుఃఖములను కలుగజేయునది.

# వివరణ:-1 అప్రమత్త దోషము వలన పట్టునది - సాధన పరిపక్వదశకు చేరబోవువారికి ఆత్మస్వరూప జ్ఞానానుభవము ఆరంభ మగుచున్నప్పుడు అప్రమత్త దోషము వలన దానిని మఱుగుచేసేలా పట్టునది, ఆణవ మలము. స్వరూప జ్ఞానమును మఱుగు పరచునది ఆణవము. ఆణవము అంటే స్వల్పమైనది, అణుసమానమైనది; స్వల్ప విషయాల యందలి అప్రమత్తత వలన పట్టుకొనెడి స్వరూపజ్ఞాన మరుపు
.2 కర్మవలన కలుగునది - సంచిత ప్రారబ్ద కర్మల వలన సాధనలో అంతరాయములు కలుగ జేయునది కార్మికము
3 మాయ వలన అంటునది - సాధనా మార్గంలో పరతత్వజ్ఞానము గురువు భోదించుచున్నను అడ్డుగా అంటుకొని ఉండే మాయ (ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపునది) - మాయకము.
4 అవిద్యచేత ఏర్పడునది - సాధన వలన విద్య, జ్ఞానము కలుగుతుంది. సాధనాలోపము వలన అవిద్య, అజ్ఞానము తొలగక పోవుట వలన గురువు ఎంత భోదించినను సాధన ఫలించదు. మాయేయము ఏర్పడుతుంది.
5 సాధనావక్రత్వము వలన మరల్చునది - గురువు తత్వభోద చేస్తుంటే సాధకుని బుద్ధి వక్రత్వము వలన సంసారము నిత్యము, పరబ్రహ్మము అనిత్యము అను అభావములు కలుగుతాయి. జననమరణ చక్రంలో చిక్కుకుని ఉంటాడు. ఇది తిరోధానమలము