పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పంచకోశ వివరములు

పంచకోశ వివరణము SK_10.2-1211-సీ.

పంచకోశములు - 1అన్నమయము 2ప్రాణమయము 3మనోమయము 4విఙ్ఞానమయము 5ఆనందమయము అనెడి కోశములు (పరమాత్మను కనబడనీయక కప్పుకొనినట్లు ఉండునవి)


1 అన్నమయ కోశము అన్నము వలన పుట్టి వృద్ధిచెందు స్థూల భౌతిక దేహము. 

2 ప్రాణమయ కోశము పంచకర్మేంద్రియములు (1వాక్కు 2పాణి 3పాద 4పాయు 5గుదములు) పంచప్రాణములు (1ప్రాణ 2అపాన 3ఉదాన 4సమాన 5వ్యానములు)తోకూడినది. 

3 మనోమయ కోశము మనస్సు, పంచఙ్ఞానేంద్రియములు ఐన ఆరింటి(1 మనః 2శ్రోత్ర 3త్వక్ 4చక్షు 5జిహ్వ 6ఘ్రాణములు)తో కూడినది. 

4 విఙ్ఞానమయ కోశము బుద్ధి, పంచఙ్ఞానేంద్రియములుతో కూడినది. 

5 ఆనందమయ కోశము ప్రియ, మోద, ప్రమోదములనెడి వృత్తులతో అఙ్ఞానమే ప్రథానముగా కల అంతఃకరణము.