స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మాది దేవతల నరనారాయణ స్తుతి (దయా ప్రదం)
బ్రహ్మాది దేవతల నరనారాయణ స్తుతి (దయా ప్రదం)
ఆ సమయంబున బ్రహ్మాది దేవత లమ్మహాత్ములకడకుఁ జనుదెంచి యిట్లని స్తుతించిరి.
"గగనస్థలిం దోఁచు గంధర్వనగరాది;
రూప భేదము లట్లు రూఢి మెఱసి
యే యాత్మయందేని యేపార మాయచే;
నీ విశ్వ మిటు రచియింపఁబడియె
నట్టి యాత్మప్రకాశార్థమై మునిరూప;
ముల ధర్ముగృహమునఁ బుట్టినట్టి
పరమపురుష! నీకుఁ బ్రణమిల్లెద; మదియుఁ;
గాక యీ సృష్టి దుష్కర్మవృత్తి
జరగనీకుండు కొఱకునై సత్త్వగుణము
చే సృజించిన మమ్మిట్లు శ్రీనివాస
మైన సరసీరుహప్రభ నపహసించు
నీ కృపాలోకనంబుల నెమ్మిఁ జూడు."
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత చతుర్థ స్కంధములోని బ్రహ్మాది దేవతల నరనారాయణ స్తుతి అను స్తుతి