స్తుతులు స్తోత్రాలు : మాలినీ పద్యాల మాలిక (భగవదనుగ్రహ ప్రదం)
మాలినీ పద్యాల మాలిక (భగవదనుగ్రహ ప్రదం)
అనుపమగుణహారా! హన్యమా నారివీరా!
జనవినుతవిహారా! జానకీ చిత్త చోరా!
దనుజ ఘన సమీరా! దానవశ్రీ విదారా!
ఘనకలుష కఠోరా! కంధి గర్వాపహారా!
నిరుపమగుణజాలా! నిర్మలానందలోలా!
దురితఘనసమీరా! దుష్టదైత్యప్రహారా!
శరధిమదవిశోషా! చారుసద్భక్తపోషా!
సరసిజదళనేత్రా! సజ్జనస్తోత్రపాత్రా!
దివిజగణశరణ్యా! దీపితానంతపుణ్యా!
ప్రవిమల గుణజాలా! భక్తలోకానుపాలా!
భవతిమిర దినేశా! భానుకోటిప్రకాశా!
కువలయహితకారీ! ఘోరదైత్యప్రహారీ!
సురవిమత విదారీ! సుందరీ శంబరారీ!
సరసవినుత సూరీ! సర్వలోకోపకారీ!
నిరుపమగుణ హారీ! నిర్మలానందకారీ!
గురుసమర విహారీ! ఘోరదైత్యప్రహారీ!
సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
భరితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా!
ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కుంభినీచక్రభర్తా!
సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భువనభరనివారీ! పుణ్యరక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషప్రవర్తీ!
ధవళబహుళకీర్తీ! ధర్మనిత్యానువర్తీ!
జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ!
సుగుణవనవిహారీ! సుందరీమానహారీ!
విగతకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ! సర్వదా సత్యభాషీ!
సరసిజనిభ హస్తా! సర్వలోక ప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!
పరహృదయ విదారీ! భక్తలోకోపకారీ!
గురు బుధజన తోషీ! ఘోరదైతేయ శోషీ!
శరధిమదవిరామా! సర్వలోకాభిరామా!
సురరిపువిషభీమా! సుందరీలోకకామా!
ధరణివరలలామా! తాపసస్తోత్రసీమా!
సురుచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!
ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా!
నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గురుబుధసుఖకర్తా! కోసలక్షోణిభర్తా!
సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!