పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : పోత నవీనపద్దతుల

"పోతన" అన్న పదాన్ని నాలుగు పాదాలలోను 'భిన్నార్థం'లో పెట్టి పోతన పైన అవధాని శ్రీ బులుసు వేంకట రామమూర్తి గారు చేసిన చమత్కార పద్యం మెరుపులు ఆస్వాదించండి.

ఉత్పలమాల:
పో నవీనపధ్ధతుల పోసెను పద్యము లందు రాము ప్రా
పో! న ప్రాగ్భవంబొ! పరిపూర్ణతరంబగు తెన్గు భాషతీ
పో? న ధార చూపె పరిపూతము భాగవతంబునందునన్
పోన సత్కవీశ్వరు డపూర్వ కవిత్వకళా విశేషముల్!

శ్రీరాముల వారి అండ (ప్రాపు) దొరకటం వలన కావచ్చు; తన పూర్వజన్మ పుణ్యాల ప్రభావం కావచ్చు; ఎన్నుకున్న తెలుగు భాష యొక్క సహజసిద్ధమైన అంత్యంత పరిపుష్టతతో కూడిన మాధుర్యం కావచ్చు; . . . ఏదైతేనేం గానీ,సత్కవీశ్వరుడు మన పోతనా మాత్యుల వారు భాగవత పురాణ ఆంధ్రీకరిస్తూ తన పద్యాలలో పోతపోసిన నవీన పద్దతులను పోసారు; తన కవితాధార అంతటిని ధారపోసి దానిని (గ్రంథాన్ని, భాషను) సుసంపన్నం చేసారు; తన అపూర్వ కవిత్వకళా విశేషములు ప్రదర్శించారు, , , , అవును ఆస్వాదించే వారిదే అదృష్టం.