పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : ముద్దులుగార

ముద్దులుగార



ఉ.

ముద్దులుగార భాగవతమున్రచియించుచు పంచదారలో

ద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ

ట్లద్దక వట్టి గంటమున ట్టిటు గీసిన తాటియాకులో

ద్దెములందు ఈ మధురభావములెచ్చటనుండి వచ్చురా!

- కరుణశ్రీ

          కరుణశ్రీ గారు బహుప్రసిద్ధమైన ఆధునిక మహాకవి పోతన భాగవతం ప్రజలలో పరివ్యాప్తి జరగటానికి వారు చేసినఅవిరళ కృషి శ్లాఘనీయమైనది. తెలుగులో భాగవతం అనగానే పోతన పద్యాలు గుర్తువస్తాయి.అది సహజం. కరుణశ్రీ పద్యాలు కూడ గుర్తొస్తాయి అది వారి విజ్ఞాన విశిష్ఠత. అట్టివాటిలో మొదటగా ఎన్నదగిన పద్యం ముద్దులుగార. పోతనవంటి మహాకవీశ్వరుని ఆసాంతం ఔపోసనపట్టి, ఇలా అలతి పొలతి పదాలతో సామాన్య పాఠకుల మనసులు దోచటానికి అసామాన్య ప్రతిభకావాలి .

 

          పోతన కవిత్వం పంచదార పాకానికిప్రసిద్ధి. పోతనగారు ముద్దులొలికేలా అంత మథురాతి మధురంగా ఎలా రాయగలిగాడు అనిసందేహం వచ్చిందిట. ఆయనంటే కష్టపడితాటియాకులపై గంటంతో రాసారు. మహాకవి కదా, రవి గాంచని చోటే కాదు కాలం కాంచనిది కూడకనగలడు. తరువాతి తరాలలో సులువుగా కలం సిరాలో ముంచి రాసేవాళ్ళం కదా. పంచదార వాడిమధుర పదార్థాలు చేసేవాళ్ళం కదా. అవన్నీ తెలిసిన వాడు కనుకపంచదారలో గంటం అద్ది తాటాకుల మీదచెమటలు కాదు ముద్దులు కారేలా రాసారు. అలాకాకుండా వట్టి గంటంతో తాటాకులమీద అక్షరాలుగీకేస్తే పద్యాలకి ఇంత మాధుర్యం రాదు కదా.అన్నారు మన కరుణశ్రీ. ఆ రోజుల్లో పంచదార ఎక్కడది అని అడక్కండి.

 

ముద్దులుగార = మృదుత్వం ఉట్టిపడేలా; భాగవతమున్ = భాగవతమును; రచియించుచు = వ్రాసేటప్పుడు; పంచదార = పంచదార; లోన్ = అందు; అద్దితివేమొ = అంటుకునేలా ముంచి; గంటము = గంటము (తాళపత్రాలపై వ్యాయుటకైన సాధనం); మహా = గొప్ప; కవి = కవులలో; శేఖర = విశిష్ఠ మైనవాడ; మధ్యమధ్య = ఆరాఆరా; అట్లు = ఆ విధంగా; అద్దక = అద్దరపోయినచో; వట్టి = ఉత్తి; గంటమునన్ = గంటంతో; అట్టిట్టు = అటుయిటు; గీసిన = వ్రాసినట్లైతే; తాటియాకు = తాళపత్రం; లోన్ = అందు; పద్దెములు = పద్యముల; అందు = లో; ఈ = ఇంతటి; మధురభావములు = చక్కటి భావాలు; ఎచ్చటనుండివచ్చురా = రావటానికి అవకాశం లేదు కదా.