పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : చేత వెన్న ముద్ద

చేత వెన్నముద్ద తెలుగువారికి చిన్నప్పటినుండి ఎంతో ప్రీతికలది.
అందరు బాలలు నేర్చుకుని ఇష్టంగా పాడతారు.
ఇది ఒక చాటువు; పద్యం కాదు; గీత లేదా గేయం;
ఇది భాగవతంలోది కాదు; ఎవరు వ్రాసారో తెలియదు; కాని,
నల్లనయ్యను ఎంతో చక్కగా పరిచయం చేస్తోంది కనుక ఇక్కడ.

చేత వెన్నముద్ద; చెంగల్వ పూదండ;
బంగారు మొలతాడు; పట్టు దట్టి;
సందె తాయత్తు; సరిమువ్వ గజ్జెలు;
చిన్నికృష్ణ! నిన్ను నే చేరికొలుతు.

భావం :- చిన్ని కృష్ణుడు, బాల కృష్ణుడు. ఎంత ముద్దుగా ఉన్నాడంటే,
ఒక చేతిలో వెన్నముద్ద పట్టుకుని ఉన్నాడట.
ఎఱ్ఱకలువపూల దండ అలంకరించారట.
మొలకు బంగారపు మొలత్రాడు కట్టారట.
చక్కటి పట్టుబట్ట గోచీపోసి కట్టారట.
చేతి దండకు తాయత్తు కట్టారట
కాళ్ళ గజ్జలు గల్లుగల్లంటునాయట
అలాంటి అద్భుతరూపంలో దర్శనమిస్తున్న ఆ కృష్ణభగవానుని దగ్గరకు చేరి సంతోషంగా నిన్ను సేవించుకుంటాను అని చెప్పుకుంటున్నారు.