పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వేగరి వ్యాఖ్యలు : 2018, 2019

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


క్రీ.శ. 2018, 2019 సంవత్సరములలో వేగరి ద్వారా తెలుగుభాగవతానికి వచ్చిన ఎంచిన స్పందనలు

తారీఖు స్పందనలు -2017అతిథి
2019-11-03ఆర్యా! తెలుగు భాష, కవుల ఇంకా చెప్పాలంటే మన హైందవ సంస్కృతి సంప్రదాయాల విలువలను మన గ్రహించుదాము అనుకొనెడి వారందరికీ, తెలుగు భాగవతం అందించడము అన్నది ఎంతో ఉపయోగరమైన గొప్పవిషయము. మనం అందరం పోతన్నగారికి ఎంతో ఋణపడి ఉంటాము. తుర్లపాటి రాం.
2019-06-28. . . భాగవతమును అంతర్జాలములో పెట్టి మా లాంటి వారికి చాల మేలు చేసారు. మీ మేలు ఎన్నటికి మరవలేము... . వాసుదేవమూర్తి
2019-05-10. . . ఇది యొక అద్భుత యత్నము. . . ఇప్పటి వారికి తెలుగు భాషాలో ప్రత్యేకమైన తెలుగు పోతన భాగవతమనే నిధి అందకుండని పరిస్థితిలో, చక్కగా అందిస్తున్నారు.. . . ఇది రాబోయే తరాలకు మైలురాయి వలె, నిథి వలె ప్రకాశిస్తుంది.. . ఆశిష జైరాం.
2019-02-06తెలుగుభాగవతం.ఆర్గ్... అద్భుతం, దార్శనీయం, జ్ఞానమయం. . . . సాంకేతికత సహాయంతో సనాతనాన్ని జ్ఞానశోధకులకు అందిస్తున్నందులకు మరోసారి వంశీ కృష్ణ.
2018-03-09 భాగవతము నిజముగ అద్బుతము, హరి మరియు హరిభక్తుల కథల సముహము. ఆది మీలాంటి వారల వలన మాకు అందడము మా అదృష్టము, దేవుని అనుగ్రహము. ఆ విష్ణువు అనుగ్రహము వలన నాకు జపానులో పిహెచ్.డి. సీటు వచ్చింది. నేను పిహెచ్.డి. బయోఫ్యూయల్స్ అనే రంగంలో చేయబోతున్నాను. పోతన గారు వివరించినట్లు, ప్రతి అణువులో విష్ణువు ఉన్నాడు. ఆ విష్ణువును నేను చేసే పనిలో కనుగొని, మన గమ్యము అయిన విష్ణువును నేను చేరుటకు ఎంతగానో తోడ్పడాలి. అది నా లక్ష్యము. దీనికి మీ ఆశీర్వాదములు కావలెను.ఆద్బుతమైన భాగవతమును తెలుగులో అదియు వెబ్సైటు రూపంలో మాకు అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు.....I... . .. నిఖిలేశు.
2018-ఫిబ్రవరి-18 I మన తెలుగు భాగవతం జాలగూడు చూసి చాలా సంతోషిస్తున్నాను. చాలా రోజుల నుండి పోతన భాగవతం సంపూర్ణంగా ప్రతిపదార్థ భావాలతో ఉన్న పుస్తకాల కోసం వెతుకుతున్నాను. కాని ఏ పుస్తకం దొరకలేదు. దీనిని చూడగానే చాలా సంతోషం అయింది.ఇంకాా పైగా ఎంతో ఉపయోగకరమైన విధంగా పద్యాలు వినడానికి వినుకరులు కూడా అందిస్తున్నారు. ఈ రోజులలో అన్నీ ఉమ్మడి కుటుంబాలు కాకవడంతో పిల్లలకు చెప్పడానికి తాతయ్యలు, మామ్మలు ఉండటంలేదు కూాడా....I... . .. అద్దంకి కేశవన్