పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :PoTeBha charani youtube-Bgvt youtube-Bgvt PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha PoTeBha
...

తెలుగు జాలనులారా మీకు స్వాగతం సుస్వాగతం. . రండి రండి. . . మీ ఈ తెలుగుభాగవతం.ఆర్గ్ ఒక అందాల భరిణ లాంటిది. మీ తెలుగు జాలజనులు (నెట్ సిటిజనులు) కోసం, ఎంతో శ్రమించి ఈ భరిణలోని అనేక "అర"లలో చేర్చి కూర్చిన ఈ ఆణిముత్యాల ఆస్వాదించండి:

వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి ఆంధ్రీకరించి ఆ అమృతబండాగారాన్ని మన తెలుగులు అందరికీ అందించారు. సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. అలాగే, ఇంత సమగ్రంగా తెలుగులోనే కాదు దేశభాషల్లో అంతర్జాలంలో అందించిన మొట్టమొదటి గ్రంథంగా మన "తెలుగు భాగవతానికే" ఆ ఘనత దక్కింది. "పలికెడిది భాగవతమట నే పలికిన భవహార మగునట" అని తన వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో చెప్పారు . మన తెలుగు భాగవతం జాలగూడు (వెబ్సైటు)లో భాగవతంలోని 9000+ పద్యాలూ ఉంచడమే కాదు వాటి ప్రతిప్రదార్ధాలు , భావాలే కాకుండా ఆ పద్యం వినేలాగా, నేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఈ జాలగూడు (వెబ్సైటు)లో ఎటువంటి వ్యాపారప్రకటనలు ఉండవు , మీరు స్వేచ్చగా ఏ పద్యానైనా కాపీ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. మీరు షేర్ చేసిన చోట మన భాగవత వెబ్సైటు పేరు ఇవ్వడం ఇవ్వకపోవడం మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం.

తెలుగు భాగవతం ఎందుకు?
విష్ణుమూర్తి కథలు శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి; వాటిని ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికప్పుడు సరి క్రొత్తగా ఉంటాయి; మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం; ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయికగా, అందిస్తున్నాం; రండి రండి:
ఈ జాలగూడులో ఏం ఉన్నాయి? ,

-


ముంగలిముంగలి":- అనే ఈ శీర్షికతోపాటు, మూత తెరవగానే మరికొన్ని శీర్షికలు ప్రవేశిక, గ్రంథము, వివరణలు, అలమార, గణాంకాలు అనేవి పైన అడ్డంగా ఎరుపు రంగులో కనిపిస్తాయి; ఎడం ప్రక్క నిలువుగా వీటితోపాటు వ్యాకరణం, స్పందనలు అనే మరికొన్ని శీర్షికలు కనబడతాయి.

 • - ప్రవేశిక "ప్రవేశిక":- ఈ శీర్షికలో ముందుమాట, అనుబంధాలు, సభలు- సమావేశాలు అనే ఉపశీర్షికలున్నాయి.
  • -- ముందుమాటలో: ఈటివి వారి పరిచయం, కాపీరైటు, ఉపోద్ఘాతం, పరిచయం, ఉపయుక్త గ్రంథాదులు, చిహ్నాలు మున్నగు వివరాలు చూడవచ్చు.
  • -- అనుబంధములు : అనే ఉప శీర్షికలో సభ్యులు, ప్రోత్సాహకులు, ఛందో ప్రక్రియలు మున్నగు వాటి గురించిన వివరాలున్నాయి.
  • -- సభలు-సమావేశాలు : మన ఈ జాలగూడు ఆవిష్కరణ, సత్సంగం, సన్మానం, వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన సభలు సమావేశాల మున్నగు వివరాలున్నాయి.
 • గ్రంథం "గ్రంథం":- అతి ముఖ్యమైన ఈ శీర్షికలో పోతన గారి భాగవతంలోని ద్వాదశ స్కంధాలలోని అద్భుతమైన పద్యాలూ, వచనాలూ (మొత్తం 9013) అన్నీ; ఘట్టాలు అనే ఉపశీర్షికలలో మీ ముందు ప్రత్యక్షం అవుతాయి. పద్యాలన్నీఛంధం అనే సాంకేతిక పరికరంతో పరీక్షింపబడ్డాయి; యతి, ప్రాసలు గుర్తింపబడ్డాయి.
  అంతేకాదు. ప్రతి పద్యానికీ మూలం, టీకా, భావం కళ్ళారా చదివి, ఆడియో అన్నిటినీ చెవులారా విని, మనసారా ఆనందించవచ్చు. అవునండి, ఆడియో బొత్తం నొక్కండి చాలు భాగవతంలోని పోతన అమృత ధార మీ చెవులలో వర్షిస్తుంది. — కావాలంటే మళ్ళీ, మళ్ళీ కూడా. మీ ఐపాడు, ఐఫోను, ఆండ్రాయిడు పరికరాలలో వినటానికి కుదరటంలేదా? - ఏం ఫరవాలేదు పఫిన్ వంటి వెబ్ బ్రౌజరు పెట్టుకోండి ఆనందంగా ఆస్వాదించండి.
  అమ్మో తొమ్మిది వేల పద్యాలలో కావలసిన పద్యం పట్టుకోడం కష్టం అనుకోకండి. ఎడం పక్క ఉన్న పక్కమెను కింద చూడండి శోధించు వాడండి. లేదా మీ కోసం సిద్ధంగా ఉంది "తెలుగు భాగవతము - అకారాది పద్య సూచిక" ఈ ఉపకరణం వాడి చూడండి, ఎంతో సులువుగా కావలసిన పద్యం దొరుకుతుంది.
  ఇంకొక ఆసక్తికర విషయం పక్కమెనూ కింది పదాలను శోధించు వాడి చూడండి. శోధించు,పదాలను శోధించులతో తెలుగు భాగవతం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, భోగినీ దండకంలతోపాటు వ్యాస భాగవతంలో ఉన్నవాటిని వెతికి పట్టుకోవచ్చండి.
  • వివరణలు "వివరణలు":- ఈ శీర్షిక శ్రీమద్భాగవతానికి సంబంధించిన ఒక "విజ్ఞాన సర్వస్వం" ("ఎన్సైక్లోపీడియా") లాగా తీర్చి దిద్దబడినది. ఇందులో అనుయుక్తాలు, ఉల్లేఖనాలు, తేనెసోనలు (ఎంచిన భాగవత పద్యాలు), పద్యరత్నాలు (మరువలేని భాగవత పద్యాలు), పద్యమధురిమలు (పోతన భాగవతానికి చెందిన కొన్ని ప్రముఖమైన పద్యాలు), సంకేతపదాలు, వంశవృక్షాలు వంటి ఉపశీర్షికలు ఉన్నాయి. ఇక్కడ అక్షౌహిణి, అరిషడ్వర్గాలు, చతుర్దశ భువనాలు, 64 విద్యలు, కాలమానం, సంఖ్యామానం వంటి 85 పైగా విషయముల గురించి ఎంతో విలువైన సమాచారం తో పాటు మానవ, దేవ, దానవులకు చెందిన సుమారు 40 వంశవృక్షాలూ, ఎంపిక చేసిన వందలాది పద్యాలూ మున్నగునవి లభిస్తాయి.
  • అల్మారా అలమార":- ఇందులో పుస్తకాలు, ప్రవచనాలు, జాలికలు, ఏప్పులు (ANDROID AAPS), భాగవత ఆణిముత్యాలు అనే ఉపశీర్షికలున్నాయి. వీక్షకుల సౌకర్యార్థం భాగవతానికి సంబంధించిన పలు విషయాలు వీటిలో చూపబడ్డాయి.
   • పుస్తకాలు - పుస్తకాలు: పోతన విరచితములైన ఇతర రచనలు - భోగినీ దండకం , నారాయణ శతకం , వీరభద్ర విజయం , వ్యాస భాగవతం మున్నగునవి ఇక్కడ చదువవచ్చు.
   • జాలము - జాలము: భాగవత సంబంధములైన వివిధ జాలగూళ్ళు, బ్లాగులు, యూట్యూబు, జాలిక రచనలు లింకులు ద్వారా ఇక్కడ నుండి వీక్షించవచ్చు.
   • ప్రవచనాలు - ప్రవచనములు: ఇందులో శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి శ్రీమద్భాగవత ప్రసంగాలు, ప్రవచనం.కం వారి జాలగూడు, శ్రీ గోలి ఆంజనేయులు , డా. నాగవల్లీ నాగరాజు గార్ల అభిభాషణలు వినుటకు లింకులు ఇవ్వబడ్డాయి.
   • ఏప్పు - ANDROID AAPS: గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఏప్పులకు లింకులు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
   • - భాగవత ఆణిముత్యాలు అనే జాలగూడుకి / ఏప్పుకి లింకు ఇక్కడ ఇవ్వబడినది.
  • గణాంకాలు "గణాంకాలు":- అనే ఈ శీర్షికలో అధ్యయనం చేసిన గణాంకాలు ఉంటాయి. వాటిని పరిశోధకులు, భాషాభిమానుల సౌకర్యార్థం భాగవతం లోని పద్యాల సంఖ్య స్కంధాల వారీగా, ఛందస్సుల వారీగా పట్టిక, మన తెలుగు భాగవతంలో ప్రయోగించిన తర, తమ పదప్రయోగాల తరతమ భేదాల జాబితా వంటివి చూడగలరు.
  • వ్యాకరణం "వ్యాకరణం":- భాగవతంలో వాడిన ఛందస్సులు "ముప్పై ఒకటి (31)", వీటి అన్నిటికి ఛందోనియమాలు ఇక్కడ చూడగలరు.
  • స్పందన "స్పందన":- ఈ శీర్షికలో మన జాలగూడు, బ్లాగులు మున్నగు వాటిపై వచ్చిన అభిప్రాయాలు, సూచనలు, విమర్శలు కొన్నిటిని చూడగలరు.
  • "సాంఘిక మాధ్యమాలు": తెలుగుభాగవతం.ఆర్గ్ ముఖ పుస్తకంలో గణనాధ్యాయి ఖాతా, భాగవతం పుట, పోతన తెలుగు భాగవతం పుట, తెలుగు భాగవతం సమూహం; మఱియు పోతన తెలుగు భాగవతం బ్లాగు, జి-ప్లస్సు (+Vsrao), ట్విట్టరు , పింటరెస్టు, యూట్యూబు ఛానలు మున్నగునవి కూడ నడుపుతోంది.